ఉగాది పచ్చడి తయారు చేయడం ఎలా?
How to make "Ugadi pachchadi"?, ugadi pachchadi, how to make ugadi pachchadi, ugadi special, ugadi, ugadi pachchadi, ఉగాది పచ్చడి, ఉగాది, ఉగాది పచ్చడి తయారి:
ఉగాది పచ్చడికి కావలసిన పదార్ధాలు:
1. బెల్లం(తీపి)
2. కొత్త చింతపండు(పులుపు)
3. వేప పువ్వు(చేదు)
4. మామిడికాయ(వగరు)
5. ఉప్పు(ఉప్పు)
6. మిరియలపొడి(కారం)
తయారు చేసుకొనే విధానం:
ముందుగా బెల్లాన్ని(50గ్రా) కోరి పెట్టుకోవాలి. కొత్త చింతపండు(చిన్న నిమ్మకాయంత)ను నీటిలో నానబెట్టి గుజ్జులాగ చేసుకోవాలి. వేప పువ్వుని వలిచి పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలను సన్నగా తరిగి పెట్టుకోవాలి.
వీటన్నిటిని ఒక చిన్న గిన్నెలో రెండు చెంచాల చింతపండు గుజ్జును వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు చింతపండులో వేసి, అలాగే తరిగిన బెల్లాన్ని కూడా గిన్నెలో వేసుకోవాలి. వలిచిన వేప పువ్వులను అలాగే మిరియాల పొడి, చిటికెడు ఉప్పు కూడా వేసి బాగా కలపాలి.
రుచికోసం అరటిపండు, గుల్ల శనగపప్పు, కొబ్బరిముక్కలు మొదలయినవి తగినంత వేసుకోవచ్చు. అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి తయారయింది. ఇక ఆరగించడమే తరవాయి.