Welcome to swarasaagaram.blogspot.in: soubhagya laxmi ravamma, soubhagya laxmi ravamma with telugu lyrics, soubhagya laxmi ravamma telugu, laxmi aarti:
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా అమ్మా
1 నుదుట కుంకుమ రవిబింబముగ కన్నులనిండుగ కాటుక వెలుగ ||
కాంచనహారము గళమున మెర యగ పీతాంబరముల శోభలునిండగ ||
||సౌభాగ్య||
2 నిండుగ కరముల బంగరుగాజులు ముద్దులొలుక పాదమ్ముల మువ్వలు ||
గలగల గలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతులసేవలనందగ ||
||సౌభాగ్య||
3 నిత్యసుమంగళి నిత్యకళ్యాణి భక్తజనులకూ కల్పవల్లి ||
కమలాసనవై కరుణనిండగా కనకవృష్టి కురిపించే తల్లి ||
||సౌభాగ్య||
4 జనకరాజుని ముద్దుల కొమరిత రవికులసోముని రమణీమణివై ||
సాథుసజ్జను లపూజలందుకొని శుభములనిచ్చెడి దీవనలీయగ ||
||సౌభాగ్య||
5 కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి ||
పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మాయింట వెలసిన ||
||సౌభాగ్య||
6 సౌభాగ్యమ్ముల బంగరుతల్లి పురందర విఠలుని పట్టపురాణి ||
శుక్రవారంబు పూజలందుకొన సాయంసంధ్యా శుభఘడియలుగా ||
||సౌభాగ్య||