Welcome to swarasaagaram.blogspot.in: nigama nigamantha, nigama nigamantha song, nigama nigamantha lyrics, nigama nigamantha annamayya lyrics, annamacharya keerthanalu, nigama nigamantha song lyrics in telugu:
నిగమ నిగమాంత...అన్నమాచార్య కీర్తన
పల్లవి: నిగమ నిగమాంతవర్ణిత మనోహరరూప |
నగరాజ ధరుడ శ్రీ నారాయణా ||
||నిగమ నిగమాంత||
చరణం1: దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబియ్య|
నోపక కదా నన్ను నొడబరపుచు||
పైపై నె సంసార బంధముల కట్టేవు |
నా పలుకు చెల్లునా నారాయణా||
||నిగమ నిగమాంత||
చరణం2: చీకాకుపడిన నా చిత్త శాంతముసేయ|
లేకకా నీవు బహు లీలనన్ను||
కాకుసేసెదవు బహు కర్మముల బడువారు|
నాకొలది వారలా నారాయణా||
||నిగమ నిగమాంత||
చరణం3: వివిధ నిర్భంధముల వెడల ద్రోయకనన్ను|
భవసాగరముల దడ బడ జేతురా||
దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ|
నవనీత చోర శ్రీనారాయణా||
||నిగమ నిగమాంత||
నిగమ నిగమాంత...అన్నమాచార్య కీర్తన
పల్లవి: నిగమ నిగమాంతవర్ణిత మనోహరరూప |
నగరాజ ధరుడ శ్రీ నారాయణా ||
||నిగమ నిగమాంత||
చరణం1: దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబియ్య|
నోపక కదా నన్ను నొడబరపుచు||
పైపై నె సంసార బంధముల కట్టేవు |
నా పలుకు చెల్లునా నారాయణా||
||నిగమ నిగమాంత||
చరణం2: చీకాకుపడిన నా చిత్త శాంతముసేయ|
లేకకా నీవు బహు లీలనన్ను||
కాకుసేసెదవు బహు కర్మముల బడువారు|
నాకొలది వారలా నారాయణా||
||నిగమ నిగమాంత||
చరణం3: వివిధ నిర్భంధముల వెడల ద్రోయకనన్ను|
భవసాగరముల దడ బడ జేతురా||
దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ|
నవనీత చోర శ్రీనారాయణా||
||నిగమ నిగమాంత||