ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Suryanarayana (Bhaskara) Dandakam in Telugu

Welcome to swarasaagaram.blogspot.in: suryanarayana dandakam, suryanarayana dandakam telugu, suryanarayana dandakam telugu lyrics, suryanarayana dandakam in telugu, bhaskara dandakam, bhaskara dandakam telugu:




శ్రీసూర్య నారాయణ దండకము 


శ్రీసూర్య నారాయణా వేదపారయణ లోకరక్షామణి 
దైవచూడమణి ఆత్మరక్షా నమ: పాపశిక్షా నమో
విశ్వకర్తా నమోభర్తా నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మ 
మూర్తీ త్రిలోకైక నాథాధినాథ మహాభూతభేదంబులు 
న్నీవయై బ్రోచు వెల్లపుడున్ భాస్కర హస్కర 

పద్మినీ వల్లభ వల్లకీ గానలోలా త్రిమూర్తి స్వరూప విరూపాక్షనేత్ర
మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్యయోయయ్య  
దుర్థాంత నిర్థూత తాపత్రయా భీలదావాగ్నీ రుద్రా తనుద్భూత మిస్సార
నిస్సార గంభీర సంభావి తానేక కామాద్య నీకంబులన్ దాకి
ఏకాకినై చిక్కి ఏదిక్కులం గానగాలేక యున్నాడ నీవాడనో తండ్రి 

జేగీయమానాయ కటాక్షంబులన్  నన్నుకృపా దృష్టి 
వీక్షించి రక్షించు వేగన్ నీ కృద దృష్టిచేతన్ మునీంద్రాదివంద్యా
జగన్నేత్రమూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు
సారథ్యమందుంటి నశ్వంబులేడింటి నన్నొంటిచక్రంబును దాల్చి
మార్తాండరూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి 
కర్మానుసారంబు దోషంబులన్ దృంచి కీర్తి ప్రతాపంబులన్ 
మించి నీదాసులన్ గాంచి యిష్టార్ధముల్ కూర్తువో 

దృష్టి వేల్పా మహా పాప కర్మాలకు 
న్నాలయంబైన యీదేహభారంబుగానీక శూరోత్తమా యొప్పు
లందప్పు నేరముల్ మాని సహస్రాంశుండవైనట్టి నీకీర్తి కీర్తింప
నేనేర్తునా ద్వాదశాత్మ దయాళుత్వమున్ తత్వమున్ జూపి నాయాత్మ
భేదంబులన్ బాపి పోషింపనీవంతు నిన్నున్ ప్రశంసింప నావంతు
నిన్శేశేషభాషాధిపుల్ గానగాలేరు నీదివ్య రూప ప్రభావంబు
గానంగ నేనెంత  నెల్లప్పుడున్ స్వల్పజీవుండ నౌదున్
మహా కష్టుడన్ నిష్టయున్లేదు నీపాద పద్మంబులే సాక్షి
దుశ్చిత్తముల్ బాపి నిశ్చింతగన్ జేయవే కామితార్ధ

శ్రీ మహా దైవ రాయ పరా వస్తులైనట్టి మూడక్షరాలన్ 
స్వరూపంబు నీ దండకం నిన్ మహిన్, రాయ కీర్తించి
(ప్రదా  యీమహిన్ నిన్ను కీర్తించి) విన్నన్ మహజన్మ
జన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్ 
కొంగుబంగారు తంగేడు జున్నై ఫలించున్గదా భాస్కరా శ్రీ
సూర్యనారాయణ  మహదేవ దేవ నమస్తే నమస్తే నమస్తే నమ:  

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please gave your valuable comment here

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Harivarasanam song by KJ Yesudasu with telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: harivarasanam song, yesudasu harivarasanam song, ayyappa swamy song harivarasanam, kj yesudasu harivarasanam, harivarasanam song by yesudasu with telugu lyrics: హరివరాసనం స్వామి...కె జె ఏసుదాసు గానం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప | శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప || హరివరాసనం స్వామి విశ్వమోహనం | హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం || అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం | హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||                                                       ||శరణం|| శరణకీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి సుప్రభాన్చితం ప్రనవమందిరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే                             ...

Shyamalaa Dandakam (Manikya Veena) with Telugu Lyrics Gantasala

Welcome to swarasaagaram.blogspot.in: shyamalaa dandakam, shyamala dandakam, shyamala dandakam telugu, shyamala dandakam with telugu lyrics, manikya veena, manikya veena mupalalayanthe, shyamaladandakam: శ్యామలాదండకం         మాణిక్యవీణా ముపలాలయంతీం  మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం  మాతంగకన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే  కుచోన్నతే కుంకు మరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణే  హస్తే నమస్తే జగదేక మాత:

Vishnu sahasranamam telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: vishnu sahasranamam, vishnu sahasranamam telugu lyrics, vishnu sahasranamam video with telugu, vishnu sahasranamam telugu, vishnu sahasranamam in telugu, vishnu sahasranamam full, vishnu sahasranamam full telugu: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || 1 || యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ | విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే || 2 || వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ | పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 4 || వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే | నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 5 || అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే | సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే || 6 || యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ | విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || 7 || ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే | శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః | యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత || 8 || యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్...