Welcome to swarasaagaram.blogspot.in: tiru veedula merasi, tiru veedula merasi lyrics, tiru veedula merasi telugu lyrics, annamacharya keerthanalu, annamayya keerthanalu, garimellla balakrishna prasad songs:
తిరువీధుల మెరసీ...అన్నమాచార్య కీర్తన
పల్లవి: తిరువీధులమెరసీ దేవ దేవుడు |
గరిమల మించిన సింగారముల తోడను ||
||తిరువీధుల||
చరణం 1: తిరుదండెల పైనేగీ దేవుడిదే తొలునాడు |
సిరుల రెండవనాడు శేషుని మీద ||
మురిపేన మూడోనాడు ముత్యాలపందిరిక్రింద ||
పొరి నాలుగోనాడు పువ్వుకోవిల లోను ||
||తిరువీధుల||
చరణం 2: గక్కన నయిదవనాడు గరుడుని మీదను |
ఎక్కెను ఆరవనాడు యేనుగు మీద ||
చొక్కమై ఏడవనాడు సూర్య ప్రభలోనను ||
యిక్కువ తేరును గుర్ర మెనిమిదోనాడు ||
||తిరువీధుల||
చరణం 3: కనకపుటందలము కదిసి తొమ్మదోనాడు |
పెనచి పదోనాడు పెండ్లిపీట ||
ఎనసి శ్రీ వేంకటేశుడింతి అలమేల్మంగతో ||
వనితల నడుమను వాహనాల మీదను ||
||తిరువీధుల||
తిరువీధుల మెరసీ...అన్నమాచార్య కీర్తన
పల్లవి: తిరువీధులమెరసీ దేవ దేవుడు |
గరిమల మించిన సింగారముల తోడను ||
||తిరువీధుల||
చరణం 1: తిరుదండెల పైనేగీ దేవుడిదే తొలునాడు |
సిరుల రెండవనాడు శేషుని మీద ||
మురిపేన మూడోనాడు ముత్యాలపందిరిక్రింద ||
పొరి నాలుగోనాడు పువ్వుకోవిల లోను ||
||తిరువీధుల||
చరణం 2: గక్కన నయిదవనాడు గరుడుని మీదను |
ఎక్కెను ఆరవనాడు యేనుగు మీద ||
చొక్కమై ఏడవనాడు సూర్య ప్రభలోనను ||
యిక్కువ తేరును గుర్ర మెనిమిదోనాడు ||
||తిరువీధుల||
చరణం 3: కనకపుటందలము కదిసి తొమ్మదోనాడు |
పెనచి పదోనాడు పెండ్లిపీట ||
ఎనసి శ్రీ వేంకటేశుడింతి అలమేల్మంగతో ||
వనితల నడుమను వాహనాల మీదను ||
||తిరువీధుల||