Welcome to swarasaagaram.blogspot.in: adigo alladigo sri hari vasamu, adigo alladigo song, annamacharya keerthanalu, annamayya keerthanalu, adigo alladigo lyrics in telugu, adigo alladigo telugu lyrics:
పల్లవి: అదివో అల్లదివో శ్రీ హరివాసము |
పల్లవి: అదివో అల్లదివో శ్రీ హరివాసము |
పదివేల శేషుల పడగలమయము ||
||అదివో||
చరణం 1: అదె వేంకటాచల మఖిలోన్నతము |
అదివో బ్రహ్మాదుల కపురూపము ||
అదివో నిత్య నివాస మఖిలమునులకు |
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము ||
||అదివో||
చరణం 2: చెంగట నల్లదివో శేషాచలము |
నింగినున్న దేవతల నిజవాసము ||
ముంగిట నల్లదివో మూలనున్నధనము |
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము ||
||అదివో||
చరణం 3: కైవల్యపదము వేంకటనగమదివో |
శ్రీ వేంకటపతికి సిరులైనది ||
భావింప సకలసంపదరూపమదివో |
పావనములకెల్ల పావనమయము||
||అదివో||