Welcome to swarasaagaram.blogspot.in: ramudu raghavudu, ramudu raghavudu ravikuluditadu, ramudu raghavudu song with telugu lyrics, annamacharya keerthana, annamayya keerthanalu, garimella bala krishna prasad songs:
పల్లవి: రాముడు రాఘవుఁడు రవికులుఁ డితఁడు |
భూమిజకు పతియైన పురుషనిధానము ||
||రాముడు||
చరణము 1: అరయ బుత్ర కామేష్టియందు బరమాన్నమున |
పరగ జనించిన పరబ్రహ్మము||
సురల రక్షింపఁగ అసురుల శిక్షింపఁగ |
తిరమై ఉదయించిన దివ్యతేజము ||
||రాముడు ||
చరణము 2: చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో |
సంతతము నిలిచిన సాకారము ||
వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి |
కాంతుల చెన్ను మీరిన కైవల్యపదము ||
||రాముడు ||
చరణము 3: వేద వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు |
పాదుకొన పలికేటి పరమార్ధము ||
పోదితో శ్రీ వేంకటాద్రి పొంచి విజనగరాన |
ఆదికి అనాదియైన అర్ఛావతారము ||
||రాముడు ||