Welcome to swarasaagaram.blogspot.in: bhrama kadigina paadamu, bhramma kadigina paadamu, bhrama kadigina paadamu song with telugu lyrics, annamacharya keerthanalu, balamurali krishna songs:
పల్లవి: బ్రహ్మ కడిగిన పాదము |
బ్రహ్మము తానె నీ పాదము ||
||బ్రహ్మ||
చరణం 1: చెలఁగి వసుధ గొలిచిన నీ పాదము |
బలితల మోపిన పాదము ||
తలఁకక గగనము తన్నిన పాదము |
బలరిపుఁ గాచిన పాదము ||
||బ్రహ్మ||
చరణం 2: కామినిపాపము కడిగిన పాదము |
పాముతల నిడిన పాదము ||
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము |
పామిడి తురగపు పాదము ||
||బ్రహ్మ||
చరణం 3: పరమ యోగులకు పరిపరి విధముల |
పర మొసఁగెడి నీ పాదము ||
తిరువేంకటగిరి తిరమని చూపిన-|
పరమపదము నీ పాదము ||
||బ్రహ్మ||