ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Endaro Mahanu Bhavulu..Tyagaraja Keerthana by Mangalampalli Balamuralikrishna with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: endaro mahanubhavulu, balamuralikrishna endaro mahanubhavulu, tyagaraja keerthanas, balamurali krishna endharo mahanubhavulu,endharo mahanubhavulu lyrics in telugu, endharo mahanubhavulu lyrics in telugu, tyagaraja krutulu, sri rama stotras:



ఎందరో మహానుభావులు || అందరికీ వందనములు ||

చందురు వర్ణుని || అంద చందమును ||
హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు ||
ఎందరో మహానుభావులు ||

ఎందరో మహానుభావులు || అందరికీ వందనములు ||

ససనిస నినిసస మపనిసరి గరిరిగరిరిగరిరిస గరిరిస  
ఎందరో మహానుభావులు || 

సామ గానలోల మనసిజలావణ్య
ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు ||

రిగరిరి గరిరిస నిసస సనిససనిగ గరిసరిగరి 
ఎందరో మహానుభావులు || 

మానసవన చర వర సంచారము 
నెరిపి మూర్తి బాగుగ పొగడనే
ఎందరో మహానుభావులు ||

పపమరిరిపపమనిపపమరి నిప నిపమ మప పమరి రిగ రిరిసని
ఎందరో మహానుభావులు || 

సరగున పాదములకు స్వాంతమను 
సరోజమును సమర్పణము సేయు
ఎందరో మహానుభావులు ||

ససని ప నిసనిప గరిసనిప మప పనిసరి గరిస రిమప సనిస నిపమ రిమ పనిప సనిప రిసనిప రిరిసనిప మరిగరిసని 
ఎందరో మహానుభావులు || 



పతిత పావనుడనే పరాత్పరుని గురించి
పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును
సల్లాపముతో స్వర లయాధి రాగముల దెలియు
ఎందరో మహానుభావులు ||

పమమప గరిగ రిరిస సరిగ రిరిస పనిసరిరి గగసరి రిమప పనిసరి రిమప నిమపనిస రిగరిరి గరిరిస సనిపమ రిగరిసని 
ఎందరో మహానుభావులు ||

హరిగుణ మణిమయ సరములు గళమున
శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో
కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు
ఎందరో మహానుభావులు ||

పనిస పనిమపరిరి మపనిపమ రిరి గరిసని గరిసని పనిసరి  మరిమప నిపమ నిసరి గరిసనిప సనిపమగ పమగరిసరిగని 
ఎందరో మహానుభావులు ||

హొయలు మీర నడలు గల్గు సరసుని
సదా కనుల జూచుచును పులక శరీరులై
ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గల
ఎందరో మహానుభావులు ||

ప రిమ రిమ రిమప మప రిగరిరి గరిస నినిస  పనిస  పపరి గరిసప పమరి మపని రిపమని సరిమపని పనిసనిస 
నిసరి రిరిరిరి రిగరి రిగరి   రిరి  సనిసస నిపనిసరి గరి రిస సని నిపమరిమపనిస సనిపమరిగరిస నిసరిసని
ఎందరో మహానుభావులు ||

పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనక కశ్యపు సుత నారద తుంబురు
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము
సదానుభవులు గాక 
ఎందరో మహానుభావులు ||


నీ మేను నామ వైభవంబులను
నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను
వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనిచకను
దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగి
సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు
ఎందరో మహానుభావులు ||

 రిమపని మపనిరి మపనిపమ రిరి గరిసనిప పనినిస 
రిపని సరిరి గరిసరిమపని పని మపరిగ రిస రిమపమప 
నిపని మపరిమప నిమపసరిరి గరిసనిప మపనినిస 
రిగరిరి గనిస నిసనిస సనిపమ రిమరిగరిమప  సనిపమరిగరిసని
ఎందరో మహానుభావులు ||

భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను
శివాది సన్మతముల గూఢములన్
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి
భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి
నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన
ఎందరో మహానుభావులు ||

ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైన 
ఎందరో మహానుభావులు ||
అందరికీ వందనములు ||


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Harivarasanam song by KJ Yesudasu with telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: harivarasanam song, yesudasu harivarasanam song, ayyappa swamy song harivarasanam, kj yesudasu harivarasanam, harivarasanam song by yesudasu with telugu lyrics: హరివరాసనం స్వామి...కె జె ఏసుదాసు గానం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప | శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప || హరివరాసనం స్వామి విశ్వమోహనం | హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం || అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం | హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||                                                       ||శరణం|| శరణకీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి సుప్రభాన్చితం ప్రనవమందిరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే                             ...

Shyamalaa Dandakam (Manikya Veena) with Telugu Lyrics Gantasala

Welcome to swarasaagaram.blogspot.in: shyamalaa dandakam, shyamala dandakam, shyamala dandakam telugu, shyamala dandakam with telugu lyrics, manikya veena, manikya veena mupalalayanthe, shyamaladandakam: శ్యామలాదండకం         మాణిక్యవీణా ముపలాలయంతీం  మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం  మాతంగకన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే  కుచోన్నతే కుంకు మరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణే  హస్తే నమస్తే జగదేక మాత:

Vishnu sahasranamam telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: vishnu sahasranamam, vishnu sahasranamam telugu lyrics, vishnu sahasranamam video with telugu, vishnu sahasranamam telugu, vishnu sahasranamam in telugu, vishnu sahasranamam full, vishnu sahasranamam full telugu: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || 1 || యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ | విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే || 2 || వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ | పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 4 || వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే | నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 5 || అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే | సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే || 6 || యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ | విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || 7 || ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే | శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః | యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత || 8 || యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్...