Welcome to swarasaagaram.blogspot.in: kondalalo nelakonna, kondalalo nelakonna koneti rayadu vaadu, kondalalo nelakonna song with lyrics, kondalalo nelakonna, annamacharya keerthana, annamayya keerthana, telugu lyrics:
పల్లవి : కొండలలోనెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు |
కొండలంతవరములు గుప్పెడు వాడు ||
||కొండల||
చరణము 1: కుమ్మరదాసుఁడైన కురువరతినంబి |
ఇమ్మన్నవరములెల్ల నిచ్చినవాఁడు ||
దొమ్ములు చేసినట్టి యు తోండమాంజక్కురవర్తి |
రమ్మన చోటికి వచ్చి నమ్మినవాఁడు ||
||కొండల||
చరణము 2: అచ్చపువేడుకతోడ అనంతాళువారికి |
ముచ్చిలి వెట్టికి మన్ను మోఁచినవాఁడు ||
మచ్చిక దొలఁక తిరుమలనంబితోడుత |
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాఁడు ||
||కొండల||
చరణము 3: కంచిలోన నుండ దిరుకచ్చినంబిమీద కరు |
ణించి తనయెడకు రప్పించినవాఁడు ||
యెంచ నెక్కుడైన వేంకటేశుఁడు మనలకు |
మంచివాడై కరుణ పాలించినవాఁడు ||
||కొండల||