Welcome to swarasaagaram.blogspot.com: ramakrishna paramahamsa, ramakrishna paramahamsa sukthulu, ramakrishna paramahamsa upadesalu, paramahamsa ramakrishna quotes, quotes in telugu: రామకృష్ణ పరమహంస ఉపదేశాలు - 1 1. ఆకాశంలో రాత్రి పూట నీకు అనేక నక్షత్రాలు కనిపిస్తాయి. సూర్యోదయం కాగానే అవి కనిపించవు. అందుచేత పగటిపూట ఆకాశంలో నక్షత్రాలు లేవని చెప్పటం సబబా? ఓ మానవుడా! నీ అజ్ఞానస్థితిలో భగవంతుణ్ణి చూడలేక పోయినంత మాత్రాన భగవంతుడు లేడని చెప్పవద్దు. 2. దుర్లభమైన మానవజన్మను ఎత్తి, ఈ జన్మలోనే భగవత్సాక్షాత్కారానికి పాటుపడని వ్యక్తి జన్మ నిరర్థకం. 3. దేన్ని తెలుసుకుంటే అన్నీ తెలిసివస్తాయో ఆ 'ఒక్కటి' తెలుసుకో. ఒకటి సంఖ్య వేసాక సున్నలు చేరిస్తే వందలు, వేలు అవుతాయి. కాని ఒకటి సంఖ్యను చెరిపేస్తే ఆ సున్నలకు విలువ లేదు. ఒకటి ఉండటం వల్లనే సున్నలకు విలువ వచ్చింది. మొదట ఒకటి, తరువాత అనేకం. మొదట దైవం, తరువాత జీవులు, జగత్తు. 4. చిన్న పిల్లలు గదిలో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు భయభక్తులు లేకుండా బొమ్మలతో ఆడుకుంటారు. కాని తల్లి కనబడగానే వాటిని అటూ, ఇటూ విసరివేసి, "అమ్మా! అమ్మా" అంటూ ఏడ...
Most valuable data of yoga yogasana asana meditation mudras kundalini samadhi self realization dhyana and telugu bhakti devotinal songs on siva vishnu krishna laxmi guru vaggeyakarulu and also mantra sthuti ashtakams and happy Dasara and deepavali wishes to you