Welcome to swarasaagaram.blogspot.com: ramakrishna paramahamsa, ramakrishna paramahamsa sukthulu, ramakrishna paramahamsa upadesalu, paramahamsa ramakrishna quotes, quotes in telugu:
2. దుర్లభమైన మానవజన్మను ఎత్తి, ఈ జన్మలోనే భగవత్సాక్షాత్కారానికి పాటుపడని వ్యక్తి జన్మ నిరర్థకం.
3. దేన్ని తెలుసుకుంటే అన్నీ తెలిసివస్తాయో ఆ 'ఒక్కటి' తెలుసుకో. ఒకటి సంఖ్య వేసాక సున్నలు చేరిస్తే వందలు, వేలు అవుతాయి. కాని ఒకటి సంఖ్యను చెరిపేస్తే ఆ సున్నలకు విలువ లేదు. ఒకటి ఉండటం వల్లనే సున్నలకు విలువ వచ్చింది. మొదట ఒకటి, తరువాత అనేకం. మొదట దైవం, తరువాత జీవులు, జగత్తు.
4. చిన్న పిల్లలు గదిలో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు భయభక్తులు లేకుండా బొమ్మలతో ఆడుకుంటారు. కాని తల్లి కనబడగానే వాటిని అటూ, ఇటూ విసరివేసి, "అమ్మా! అమ్మా" అంటూ ఏడుస్తూ పోతారు. ఓ మానవుల్లారా! మీరు కూడా భయం గాని, ఆరాటం గాని లేకుండా సంపద, గౌరవం, కీర్తి అనే వాటితో మదించి ఈ ప్రాపంచిక జగత్తులో ఆడుకుంటున్నారు. ఒక్కసారి దివ్యజననిని చూచారా, వీటన్నింటిలో మీకు ఆసక్తి ఉండదు.
5. సముద్రగర్భంలో ముత్యాలున్నాయి. కాని అవి కావాలంటే ఎన్నో ప్రమాదాలను ఎదుర్కోవాలి. ఒకసారి మునగటంలో అవి నీకు లభించకపోతే, సముద్రంలో ముత్యాలే లేవని నిర్ణయానికి రాకు. మళ్ళీ, మళ్ళీ మునిగావా, చివరకు నీకు ఫలితం దక్కి తీరుతుంది. అదే విధంగా భగవదన్వేషణలో నీ ప్రథమ ప్రయత్నాలు నిష్ఫలమైతే, నిరుత్సాహపడ వద్దు. ప్రయత్నం చేస్తూనే ఉంటే, చివరకు భగవంతుణ్ణి దర్శించి తీరుతావు.
6. భగవంతుడు అనంతుడు. జీవుడు పరిమితుడు. అందువల్ల పరిమితమైన జీవుడు అఖండాన్ని ఎలా అర్థం చేసుకుంటాడు? అది ఉప్పుబొమ్మ సముద్రపు లోతు కొలవడానికి ప్రయత్నించినట్లుంటుంది. ఆ ప్రయత్నంలో ఉప్పు బొమ్మ సముద్రంలో కరిగి మటుమాయం అవుతుంది. అదే విధంగా జీవుడు భగవంతుణ్ణి అంచనా వేసి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి అతనిలో తాదాత్మ్యాన్ని చెందుతాడు.
7. మానవరూపంలో భగవంతుడు క్రీడిస్తున్నాడు. అతడొక గొప్ప గారడీవాడు. జగత్తులనేవి అతని అద్భుతమైన గారడీ. గారడీవాడొక్కడే నిత్యం. గారడీ అసత్యం.
8. మానవ శరీరం కుండవంటిది. మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అనేవి నీళ్ళు, బియ్యం, బంగాళాదుంపలు మొదలైనటువంటివి. బియ్యం, బంగాళాదుంపలు నీళ్ళ కుండలో పోసి మంట మీద పెడితే, అవి కూడా వేడెక్కి తాకితే చేతిని కాలుస్తాయి. వాస్తవానికి వేడి అనేది కుండకు గాని, నీటికి గాని, బంగాళా దుంపలకు గాని చెందదు. అదే విధంగా మానవుడిలోని బ్రహ్మశక్తి మాత్రమే మనస్సును, బుద్ధిని, ఇంద్రియాలను వాటి వాటి పనులు చేసేట్లు చేస్తుంది. ఆ శక్తి ఆగిపోతే ఇవన్నీ ఆగిపోతాయి.
9. కుబుసానికంటే పాము ఎలా వేరై ఉందో అదే విధంగా శరీరానికి ఆత్మ భిన్నంగా ఉంది.
Welcome to swarasaagaram.blogspot.in: subramaya ashtakam, sri subramanya ashtakam, subramanya ashtakam with telugu lyrics, subramanya ashtakam in telugu: శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ హే స్వామి నాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో శ్రీ శాది దేవగణ పూజిత పాదపద్మ వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ దేవాది దేవసుత దేవగణాధినాథ దేవేంద్రవంధ్య మృదుపంకజ మంజుపాద దేవర్షి నారదమునీంద్ర సుగీత కీర్తే వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ నిత్యాన్నదాన నిరతాఖిల రోగహరిన్ తస్మాత్ ప్రదాన పరిపూరాత భక్తకామ శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ క్రౌంచ సురేంద్ర మదఖండన శక్తిశూల చాపాది పాశాది శస్ర్త పరమండిత దివ్యపాణే శ్రీకుండలీశ దృతతుండ శిఖీంద్ర వాహ వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ దేవాది దేవ రథమండల మధ్యమేత్య దేవేంద్ర పీఠ నగరం దృఢచాప హస్తం శూరం నిహత్య సురకోటిభి రీడ్యమాన వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ హారాదిరత్న మణియుక్త కిరీటహార కేయూర కుండల లసత్కవచాభిరామ హేవీర తారక జయామర బృంద వంద్య వల్లీసనాథ మమ దేహికరావలంబమ్ పంచాక్షరాది మను మంత్రిత గాంగతోయై: పంచామృతై: ప్రముదితే
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Please gave your valuable comment here