ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Sri Subramanya Ashtotharam with English and Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.com: subramanya ashtotharam, telugu stotrams, subhramanya, sri subramaniya ashtotharam: శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరం: ఓం స్కందాయ నమ: ఓం గుహాయ నమ: ఓం షణ్ముఖాయ నమ: ఓం ఫాలనేత్రసుతాయ నమ: ఓం ప్రభవే నమ: ఓం పింగళాయ నమ: ఓం కృత్తికాసునయే నమ: ఓం శిఖివాహనాయ నమ: ఓం ద్వినద్భుజాయ నమ: ఓం ద్వినత్రేయాయ నమ: ఓం శక్తిథరాయ నమ: ఓం పిశిదాసప్రభంజాయనమ: ఓం తారకాసురాసంహరాయ నమ: ఓం రక్షోబలవిమర్దనాయ నమ: ఓం మత్తాయ నమ: ఓం ప్రమత్తాయ నమ: ఓం ఉన్మత్తాయ నమ: ఓం సురసైన్యసురక్షాయ నమ: ఓం దేవసేనాపతయే నమ: ఓం ప్రాఘ్నాలయే నమ: ఓం కృపాలయే నమ: ఓం భక్తవత్సలాయ నమ: ఓం ఉమాసుతాయ నమ: ఓం శక్తిధరాయ నమ: ఓం కుమారాయ నమ: ఓం క్రౌంచధారణాయ నమ: ఓం సేనాన్యే నమ: ఓం అగ్నిజననే నమ: ఓం విశాఖాయ నమ: ఓం శంకరాత్మజాయ నమ: ఓం శివాస్వామినే నమ: ఓం గణస్వామినే నమ: ఓం సర్వస్వామినే నమ: ఓం సనాతనాయ నమ: ఓం అనంతశక్తాయే నమ: ఓం అక్షోభ్యాయ నమ: ఓం పార్వతీప్రియనందనాయ నమ: ఓం గంగాసుతాయ నమ: ఓం సరోద్భుతాయ నమ: ...

Maa Telugu Talliki Original Song by Tanguturi SuryaKumari :Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.com: maa telugu talliki song, maa telugu talliki song lyrics, maa telugu talliki original song, swara, swara sagaram, maa telugu talliki song lyrics in telugu, maa telugu talliki song writer: మా తెలుగు తల్లికి మల్లెపూదండ- రచన: శంకరంబాడి సుందరాచారి గానం: టంగుటూరి సూర్యకుమారి పల్లవి: మా తెలుగు తల్లికి మల్లెపూదండ|| మా కన్న తల్లికి మంగళారతులు|| చరణం1: కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరిలించు మాతల్లి ||మా తెలుగు|| చరణం2: గలగలా గోదారి తరలి పోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి ||మా తెలుగు|| చరణం3: అమరావతి గుహల అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు నిత్యమై నికిలమై నిలిచి ఉండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరసు కీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ పాటలే పాడుతాం. నీ ఆటలే ఆడుతాం. జై తెలుగు తల్లి..జై తెలుగు తల్లి..!

Jaya Jaya Jaya Priya Bharatha Lyrics in Telugu: Devulapalli Krishna Shastri

Welcome to swarasaagaram.blogspot.com: jaya jaya jaya priya bharatha lyrics in telugu, jaya jaya jaya priya bharatha song download, jaya jaya jaya priya bharatha audio song, jaya jaya jaya priya bhratha mp3 song, devulapalli krishnasastri, swara, swara sagaram: జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి - రచన: దేవుల పల్లి కృష్ణశాస్త్రి పల్లవి: జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి ||జయ జయ|| చరణం1: జయ జయ సస్యామల సుశ్యామలచల చ్చేలాంచల జయ వసంత కుసుమ లతా చలిత లలిత చూర్ణకుంతల జయమదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా ||జయ జయ|| చరణం2: జయదిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయ గాయక వైతాళిక గళవిశాల పథ విహరణ జయ మదీయ మధుర గేయ చుంభిత సుందర చరణా ||జయ జయ||

Ramakrishna Paramahamsa Upadesalu ( Quotes ) in Telugu -1

Welcome to swarasaagaram.blogspot.com: ramakrishna paramahamsa, ramakrishna paramahamsa sukthulu, ramakrishna paramahamsa upadesalu, paramahamsa ramakrishna quotes, quotes in telugu: రామకృష్ణ పరమహంస ఉపదేశాలు - 1 1. ఆకాశంలో రాత్రి పూట నీకు అనేక నక్షత్రాలు కనిపిస్తాయి. సూర్యోదయం కాగానే అవి కనిపించవు. అందుచేత పగటిపూట ఆకాశంలో నక్షత్రాలు లేవని చెప్పటం సబబా? ఓ మానవుడా! నీ అజ్ఞానస్థితిలో భగవంతుణ్ణి చూడలేక పోయినంత మాత్రాన భగవంతుడు లేడని చెప్పవద్దు. 2. దుర్లభమైన మానవజన్మను ఎత్తి, ఈ జన్మలోనే భగవత్సాక్షాత్కారానికి పాటుపడని వ్యక్తి జన్మ నిరర్థకం. 3. దేన్ని తెలుసుకుంటే అన్నీ తెలిసివస్తాయో ఆ 'ఒక్కటి' తెలుసుకో. ఒకటి సంఖ్య వేసాక సున్నలు చేరిస్తే వందలు, వేలు అవుతాయి. కాని ఒకటి సంఖ్యను చెరిపేస్తే ఆ సున్నలకు విలువ లేదు. ఒకటి ఉండటం వల్లనే సున్నలకు విలువ వచ్చింది. మొదట ఒకటి, తరువాత అనేకం. మొదట దైవం, తరువాత జీవులు, జగత్తు. 4. చిన్న పిల్లలు గదిలో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు భయభక్తులు లేకుండా బొమ్మలతో ఆడుకుంటారు. కాని తల్లి కనబడగానే వాటిని అటూ, ఇటూ విసరివేసి, "అమ్మా! అమ్మా" అంటూ ఏడ...

Sita Kalyana Vaibhogame Song by KJ Yesudasu with Telugu Lyrics: Tyagaraja Kruti

Welcome to swarasaagaram.blogspot.com: seeta kalyana vaibhogame, sita kalyanam, sita kalyana lyrics, sita kalyana vaibhogame lyrics in telugu, sita kalyana vaibhogame song, K J yesudasu songs, swara, swarasagaram, swara sagaram, swara saagaram: సీతా కళ్యాణ వైభోగమే త్యాగరాజ కృతి పల్లవి: సీతా కళ్యాణ వైభోగమే|| రామ కళ్యాణ వైభోగమే|| చరణం1:  పవనజ స్తుతిపాత్ర పావన చరిత్ర|| రవిసోమ వరనేత్ర రమణీయ గాత్ర|| ||సీతా కళ్యాణ|| చరణం2: సర్వలోకాధార సమరైకధీర గర్వమానసదూర కనగాధధీర ||సీతా కళ్యాణ|| చరణం3: నిగమాగమ విహార నిరుపమ శరీర నగధరాగ విధార నటలోకాధార ||సీతా కళ్యాణ|| చరణం4: పరమేశ్వర నుతగీత భవజలధి బోధ తరణికుల సంజాత త్యాగరాజనుత ||సీతా కళ్యాణ||

Ramadasu Keerthanalu with Telugu Lyrics by M Balamuralikrishna

Welcome to swarasaagaram.blogspot.com: ramadasu keerthanalu, ramadasu songs, ramadasu video songs, ramadasu songs lyrics, balamuralikrishna songs, swara, swara sagaram: పలుకే బంగారమాయెరా: రామదాసు కీర్తనలు పల్లవి: పలుకే బంగారమాయెరా కోదండపాణి|| పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరవ చక్కని స్వామి ||పలుకే బంగారమాయెరా|| చరణం1: ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుతను కరుణించి బ్రోచితివని చెర నమ్మితిని తండ్రి ||పలుకే బంగారమాయెరా|| చరణం2: రాతిని నాతిగ చేసి భూతలమున ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి ||పలుకే బంగారమాయెరా|| చరణం3: శరణాగతత్రాణ బిరుదాంకితుడవుగాద కరుణించు భద్రాచల వరరామదాసపోష ||పలుకే బంగారమాయెరా||

Surya Namaskar Steps Benefits Mantra Yoga : Yogasanas Swara Sagaram

Welcome to swarasaagaram.blogspot.com: yoga, surya namaskar, surya namaskar steps, surya namaskar benefits, surya namaskar mantra, suryanamaskar yoga, hata yoga, yoga, asanas, yoga asanas: సూర్యనమస్కారాలు: ప్రస్తుత  ఉరుకుల పరుగుల జీవితంలో శరీర ఆరోగ్యానికి కేటాయించుకునే సమయమే చాలా తక్కువగా ఉంటుంది. ఇక యోగాసనాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరిక ఉన్నా అందుకు సమయాభావం అడ్డుపడుతుంది. అటువంటి వారి కోసం కొద్ది సమయంలోనే 12 భంగిమలను కలిపి ఒకేసారి చేసే అవకాశం సూర్యనమస్కారాలు.  సూర్యనమస్కారం భంగిమలు: నమస్కార ముద్ర   అర్థ చక్రాసనం ఉత్త పాదాసనం అశ్వ సంచాలనాసనం తులాసనం(దండాసనం) అష్ఠాంగ నమస్కారం భుజంగాసనం పర్వతాసనం అశ్వ సంచాలనాసనం ఉత్త పాదాసనం అర్థ చక్రాసనం నమస్కార ముద్ర  ఒక్కో భంగిమలో కొద్దిసేపు ఉండి తర్వాత రెండో భంగిమకు వెళ్లవచ్చు. లేదా వేగంగా 12 భంగిమలను పలు సార్లు చేయవచ్చు.  ఉపయోగాలు: సూర్య  నమస్కారాలు రోజు క్రమం తప్పకుండా చేయడం వల్ల మన శరీరంలోని గుండె, కాలేయం, పొట్ట, ఛాతీ, గొంతు, కాళ్లు వంటి వివిధ భాగాల పనితీరు మెరుగవుతుంది. అన్ని శరీర భాగాలక...