ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Ramakrishna Paramahamsa Upadesalu ( Quotes ) in Telugu -1

Welcome to swarasaagaram.blogspot.com: ramakrishna paramahamsa, ramakrishna paramahamsa sukthulu, ramakrishna paramahamsa upadesalu, paramahamsa ramakrishna quotes, quotes in telugu:

రామకృష్ణ పరమహంస ఉపదేశాలు - 1

ramakrishna paramahamsa images

1. ఆకాశంలో రాత్రి పూట నీకు అనేక నక్షత్రాలు కనిపిస్తాయి. సూర్యోదయం కాగానే అవి కనిపించవు. అందుచేత పగటిపూట ఆకాశంలో నక్షత్రాలు లేవని చెప్పటం సబబా? ఓ మానవుడా! నీ అజ్ఞానస్థితిలో భగవంతుణ్ణి చూడలేక పోయినంత మాత్రాన భగవంతుడు లేడని చెప్పవద్దు.

2. దుర్లభమైన మానవజన్మను ఎత్తి, ఈ జన్మలోనే భగవత్సాక్షాత్కారానికి పాటుపడని వ్యక్తి జన్మ నిరర్థకం.

3. దేన్ని తెలుసుకుంటే అన్నీ తెలిసివస్తాయో ఆ 'ఒక్కటి' తెలుసుకో. ఒకటి సంఖ్య వేసాక సున్నలు చేరిస్తే వందలు, వేలు అవుతాయి. కాని ఒకటి సంఖ్యను చెరిపేస్తే ఆ సున్నలకు విలువ లేదు. ఒకటి ఉండటం వల్లనే సున్నలకు విలువ వచ్చింది. మొదట ఒకటి, తరువాత అనేకం. మొదట దైవం, తరువాత జీవులు, జగత్తు.

4. చిన్న పిల్లలు గదిలో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు భయభక్తులు లేకుండా బొమ్మలతో ఆడుకుంటారు. కాని తల్లి కనబడగానే వాటిని అటూ, ఇటూ విసరివేసి, "అమ్మా! అమ్మా" అంటూ ఏడుస్తూ పోతారు. ఓ మానవుల్లారా! మీరు కూడా భయం గాని, ఆరాటం గాని లేకుండా సంపద, గౌరవం, కీర్తి అనే వాటితో మదించి ఈ ప్రాపంచిక జగత్తులో ఆడుకుంటున్నారు. ఒక్కసారి దివ్యజననిని చూచారా, వీటన్నింటిలో మీకు ఆసక్తి ఉండదు.

5. సముద్రగర్భంలో ముత్యాలున్నాయి. కాని అవి కావాలంటే ఎన్నో ప్రమాదాలను ఎదుర్కోవాలి. ఒకసారి మునగటంలో అవి నీకు లభించకపోతే, సముద్రంలో ముత్యాలే లేవని నిర్ణయానికి రాకు. మళ్ళీ, మళ్ళీ మునిగావా, చివరకు నీకు ఫలితం దక్కి తీరుతుంది. అదే విధంగా భగవదన్వేషణలో నీ ప్రథమ ప్రయత్నాలు నిష్ఫలమైతే, నిరుత్సాహపడ వద్దు. ప్రయత్నం చేస్తూనే ఉంటే, చివరకు భగవంతుణ్ణి దర్శించి తీరుతావు.

6. భగవంతుడు అనంతుడు. జీవుడు పరిమితుడు. అందువల్ల పరిమితమైన జీవుడు అఖండాన్ని ఎలా అర్థం చేసుకుంటాడు? అది ఉప్పుబొమ్మ సముద్రపు లోతు కొలవడానికి ప్రయత్నించినట్లుంటుంది. ఆ ప్రయత్నంలో ఉప్పు బొమ్మ సముద్రంలో కరిగి మటుమాయం అవుతుంది. అదే విధంగా జీవుడు భగవంతుణ్ణి అంచనా వేసి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి అతనిలో తాదాత్మ్యాన్ని చెందుతాడు.

7. మానవరూపంలో భగవంతుడు క్రీడిస్తున్నాడు. అతడొక గొప్ప గారడీవాడు. జగత్తులనేవి అతని అద్భుతమైన గారడీ. గారడీవాడొక్కడే నిత్యం. గారడీ అసత్యం.

8. మానవ శరీరం కుండవంటిది. మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అనేవి నీళ్ళు, బియ్యం, బంగాళాదుంపలు మొదలైనటువంటివి. బియ్యం, బంగాళాదుంపలు నీళ్ళ కుండలో పోసి మంట మీద పెడితే, అవి కూడా వేడెక్కి తాకితే చేతిని కాలుస్తాయి. వాస్తవానికి వేడి అనేది కుండకు గాని, నీటికి గాని, బంగాళా దుంపలకు గాని చెందదు. అదే విధంగా మానవుడిలోని బ్రహ్మశక్తి మాత్రమే మనస్సును, బుద్ధిని, ఇంద్రియాలను వాటి వాటి పనులు చేసేట్లు చేస్తుంది. ఆ శక్తి ఆగిపోతే ఇవన్నీ ఆగిపోతాయి.

9. కుబుసానికంటే పాము ఎలా వేరై ఉందో అదే విధంగా శరీరానికి ఆత్మ భిన్నంగా ఉంది.

10. మూడు రకాల బొమ్మలున్నాయి. ఉప్పుతో చేసింది. గుడ్డతో చేసింది, రాతితో చేసింది. వీటిని నీళ్ళలో ముంచితే మొదటిది కరిగిపోయి తన రూపాన్నే కోల్పోతుంది. రెండవది చాలా నీళ్ళను పీల్చుకున్నా అదే ఆకారాన్ని సంతరించుకుని ఉంటుంది. మూడవ దానిలోకి నీరు పోనేపోదు. మొదటి బొమ్మ తన వ్యక్తిత్వాన్ని సర్వవ్యాప్తమైన అనంతాత్మలో లీనం చేసుకుని దాన్లో తాదాత్మ్యాన్ని చెందిన వ్యక్తిని సూచిస్తుంది. రెండవది దివ్యానందంతోను, జ్ఞానంతోను నిండిపోయిన భక్తుడ్ని సూచిస్తుంది. మూడవది, భక్తిజ్ఞానాలు అణుమాత్రమైనా లోనికి చొరనివ్వని ప్రాపంచిక వ్యక్తిని సూచిస్తుంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Harivarasanam song by KJ Yesudasu with telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: harivarasanam song, yesudasu harivarasanam song, ayyappa swamy song harivarasanam, kj yesudasu harivarasanam, harivarasanam song by yesudasu with telugu lyrics: హరివరాసనం స్వామి...కె జె ఏసుదాసు గానం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప | శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప || హరివరాసనం స్వామి విశ్వమోహనం | హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం || అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం | హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||                                                       ||శరణం|| శరణకీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి సుప్రభాన్చితం ప్రనవమందిరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే                             ...

Vishnu sahasranamam telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: vishnu sahasranamam, vishnu sahasranamam telugu lyrics, vishnu sahasranamam video with telugu, vishnu sahasranamam telugu, vishnu sahasranamam in telugu, vishnu sahasranamam full, vishnu sahasranamam full telugu: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || 1 || యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ | విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే || 2 || వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ | పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 4 || వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే | నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 5 || అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే | సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే || 6 || యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ | విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || 7 || ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే | శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః | యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత || 8 || యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్...

Brahma murari surarchita lingam Lingastakam telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: lingastakam, lingastakam telugu, lingastakam telugu lyrics, brahma murari surarchita lingam song, brahma murari telugu lyrics, brahma murari telugu song lyrics, brahma murari lyrics in telugu: లింగాష్టకమ్ బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్  జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగమ్ రావణ దర్ప వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగమ్ సిద్ధ సురాసుర వందిత లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ దక్ష సుయఙ్ఞ వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ కుంకుమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగమ్ సంచిత పాప వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తిభిరేవ చ లింగమ్ దినకర కోటి ప్రభాకర లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగమ్ అష్టదరిద్ర వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ...