Welcome to swarasaagaram.blogspot.in: muddu gare yashoda song, annamacharya keerathana muddu gare yashoda, muddugare yashoda with telugu lyrics:
ముద్దుగారే యశోద...అన్నమాచార్య కీర్తన
పల్లవి: ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు |
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ||
||ముద్దుగారే||
||ముద్దుగారే||
చరణం 1: అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము |
పంతమాడే కంసుని పాలి వజ్రము ||
పంతమాడే కంసుని పాలి వజ్రము ||
కాంతుల మూడు లోకాల గరుడపచ్చా పూస |
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ||
||ముద్దుగారే||
చరణం 2: రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము |
మితి గోవర్ధనపు గోమేధికము ||
సతమై శంఖచక్రాల సందుల వైడూర్యము ||
గతియై మమ్ము గాచే కమలాక్షుడు ||
||ముద్దుగారే||
చరణం 3: కాళింగుని తలలాపై గప్పిన పుష్యరాగము |
యేలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము ||
పాలజలనిధిలోన బాయని దివ్య రత్నము |
బాలునీవలె దిరిగే పద్మనాభుడు ||
||ముద్దుగారే||
u r doing great job..... thank u very much for giving these all songs in telugu.....
రిప్లయితొలగించండి