Welcome to swarasaagaram.blogspot.in: pidikita talambrala pendlikuturu, pidikita talambrala pendlikuturu song, pidikita talambrala pendlikuturu telugu lyrics, pidikital talambrala pendlikuturu annamacharya keerthana, pidikita talambrala telugu lyrics:
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అన్నమాచార్య కీర్తన
పల్లవి: పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత|
పెడమరలి నవ్వీనె పెండ్లికూతురు||
పెడమరలి నవ్వీనె పెండ్లికూతురు||
||పిడికిట||
చరణం1: పేరుకల జవరాలె పెండ్లికూతురు పెద్ద|
పేరుల ముత్యాలమెడ పెండ్లికూతురు||
పేరంటాండ్ల నడిమి పెండ్లికూతురు విభు|
పేరుకుచ్చ సిగ్గువడీ పెండ్లికూతురు||
||పిడికిట||
చరణం2: బిరుదు పెండెము వెట్టె పెండ్లికూతురు నెర|
బిరుదు మగని కంటె పెండ్లికూతురు||
పిరిదూరి నప్పుడె పెండ్లికూతురు పతి|
పెరరేచీ నిదివో పెండ్లికూతురు||
||పిడికిట||
చరణం3: పెట్టెనె పెద్ద తురుము పెండ్లికూతురు నేడె|
పెట్టెడు చీరలు గట్టె పెండ్లికూతురు||
గట్టిగ వేంకటపతి కౌగిటను వడి|
వెట్టిన నిధానమైన పెండ్లికూతురు||
||పిడికిట||
Thank you a lot for th correct lyrics
రిప్లయితొలగించండిEntha baga annamacharyuluvaru pendli koothuru perugala javaralee lakshmi devi pellikoothuru amma anandamu chendhinadh prekshka bhakthulaku prem. Kalam raju Radha Krishna Murthy Markapur prakasam district A.P. Bharatha Desamu. Swasthi.
రిప్లయితొలగించండిచక్కటి పదాలతో మధురమైన స్వరంతో పెండ్లి కూతురు యొక్క మనోభావాలను గుండెకు హత్తుకునేలా ప్రతి ఒక్కరూ సులభంగా పాడుతూ కళ్ళలో ఆనంద భాష్పాలతో స్వామి వారినీ అమ్మవారిని తలచుకుంటూ కల్యాణం వీక్షించడం మన పూర్వ జన్మ సుకృతం... ఓం నమో శ్రీ లక్ష్మి పద్మావతి మాతల సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి నే నమః
రిప్లయితొలగించండి