ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Pidikita Talambrala Pendli Kuturu Telugu Lyrics Annamacharya Keerthana

Welcome to swarasaagaram.blogspot.in: pidikita talambrala pendlikuturu, pidikita talambrala pendlikuturu song, pidikita talambrala pendlikuturu telugu lyrics, pidikital talambrala pendlikuturu annamacharya keerthana, pidikita talambrala telugu lyrics:






పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అన్నమాచార్య కీర్తన


పల్లవి: పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత|
             పెడమరలి నవ్వీనె పెండ్లికూతురు||


                                                          ||పిడికిట||

చరణం1: పేరుకల జవరాలె పెండ్లికూతురు పెద్ద|
             పేరుల ముత్యాలమెడ పెండ్లికూతురు||
             పేరంటాండ్ల నడిమి పెండ్లికూతురు విభు|
             పేరుకుచ్చ సిగ్గువడీ పెండ్లికూతురు||

                                                          ||పిడికిట||

చరణం2: బిరుదు పెండెము వెట్టె పెండ్లికూతురు నెర|
             బిరుదు మగని కంటె పెండ్లికూతురు||
             పిరిదూరి నప్పుడె పెండ్లికూతురు పతి|
             పెరరేచీ నిదివో పెండ్లికూతురు||

                                                         ||పిడికిట||

చరణం3: పెట్టెనె పెద్ద తురుము పెండ్లికూతురు నేడె|
             పెట్టెడు చీరలు గట్టె పెండ్లికూతురు||
             గట్టిగ వేంకటపతి కౌగిటను వడి|
             వెట్టిన నిధానమైన పెండ్లికూతురు||

                                                        ||పిడికిట||

కామెంట్‌లు

  1. Entha baga annamacharyuluvaru pendli koothuru perugala javaralee lakshmi devi pellikoothuru amma anandamu chendhinadh prekshka bhakthulaku prem. Kalam raju Radha Krishna Murthy Markapur prakasam district A.P. Bharatha Desamu. Swasthi.

    రిప్లయితొలగించండి
  2. చక్కటి పదాలతో మధురమైన స్వరంతో పెండ్లి కూతురు యొక్క మనోభావాలను గుండెకు హత్తుకునేలా ప్రతి ఒక్కరూ సులభంగా పాడుతూ కళ్ళలో ఆనంద భాష్పాలతో స్వామి వారినీ అమ్మవారిని తలచుకుంటూ కల్యాణం వీక్షించడం మన పూర్వ జన్మ సుకృతం... ఓం నమో శ్రీ లక్ష్మి పద్మావతి మాతల సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి నే నమః

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please gave your valuable comment here

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Garuda Gamana Tava Song

 

Brahma murari surarchita lingam Lingastakam telugu lyrics

Welcome to swarasaagaram.blogspot.in: lingastakam, lingastakam telugu, lingastakam telugu lyrics, brahma murari surarchita lingam song, brahma murari telugu lyrics, brahma murari telugu song lyrics, brahma murari lyrics in telugu: లింగాష్టకమ్ బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్  జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగమ్ రావణ దర్ప వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగమ్ సిద్ధ సురాసుర వందిత లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ దక్ష సుయఙ్ఞ వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ కుంకుమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగమ్ సంచిత పాప వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తిభిరేవ చ లింగమ్ దినకర కోటి ప్రభాకర లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగమ్ అష్టదరిద్ర వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ...

Soubhagya Laxmi Ravamma...Laxmi Aarti with Telugu Lyrics

Welcome to swarasaagaram.blogspot.in: soubhagya laxmi ravamma, soubhagya laxmi ravamma with telugu lyrics, soubhagya laxmi ravamma telugu, laxmi aarti:        సౌభాగ్యలక్ష్మీ  రావమ్మా      సౌభాగ్యలక్ష్మీ రావమ్మా  అమ్మా 1   నుదుట  కుంకుమ  రవిబింబముగ  కన్నులనిండుగ కాటుక వెలుగ ||      కాంచనహారము గళమున  మెర యగ పీతాంబరముల శోభలునిండగ  ||                                                                                        ||సౌభాగ్య|| 2   న...